వందిత శుభగుణశాలీ Vandita shubhaguna shaali

వందిత శుభగుణశాలీ మానవ-మోచక! దయాంబురాశీ! వందిత శుభగుణశాలీ మానవ-మోచక! దయాంబురాశీ! అగణిత దూత ప్రణుతా! పతితావన! అగణిత దూత ప్రణుతా! పతితావన! వందిత శుభగుణశాలీ మానవ-మోచక! దయాంబురాశీ!
వందిత శుభగుణశాలీ మానవ-మోచక! దయాంబురాశీ!

1. ఆది పాప శాపంబుగ ధరపై ముళ్ళనొసగి మాక్రూర కరములకు (2)
నినుహింసించెడి మార్గము చూపితే మా కొరకే యా శిక్ష భరించితే
నాదు యేసువా! నాటి యెహోవా....!
భళిరే! ఈ దౌర్భాగ్య నరులపై
నీదు కృపా బాహుళ్యమింతయా!
అగణిత దూత ప్రణుతా! పతితావన!
అగణిత దూత ప్రణుతా! పతితావన! ||వందిత||

2. నాకపు ఘన మందిరపు నివాసము కన్నపతిత ప్రక్షాళితమానవ (2)
హృదియే ఘనమని మము దయ గంటివే 
మము నీ మహిమాలయముగ జేసితే 
నాదు యేసువా! నాటి యెహోవా! భళిరే! 
ఈ నిర్భాగ్యనరులపై నీ కరుణా దాతృత్వమింతయా! అగణిత దూత ప్రణుతా! పతితావన! 
అగణిత దూత ప్రణుతా! పతితావన ||వందిత||

No comments: