09 July 2022

Prardhanalu aalakinchu deva | ప్రార్ధనలు ఆలకించు దేవా

ప్రార్ధనలు ఆలకించు దేవా – మొరలన్నీ వినువాడా
నా పక్షమున పోరాడే దేవా - జయమిచ్చి నడుపువాడా (2)
నా దేవా నా దేవా - ధ్వజమై నడుపువాడా…
నా దేవా నా దేవా - విడుదల నొసగువాడా…(2) ||ప్రార్ధనలు||

1.అలలెన్నో లేచినను - అగ్నిలో నడచినను (2)
నీ కృపలో నను కాచితివి - అద్భుతముగా మార్చితివి (2)
నా దేవా నా దేవా - ధ్వజమై నడుపువాడా…
నా దేవా నా దేవా - విడుదల నొసగువాడా…(2) ||ప్రార్ధనలు||

2.మంచివాడా మహోన్నతుడా - మహిమాన్వితుడా మంచి చేయువాడా
సర్వోన్నతుడా సర్వ సాక్షిమంతుడా - నా దేవా నా దేవా (2)
నా దేవా నా దేవా - ధ్వజమై నడుపువాడా…
నా దేవా నా దేవా - విడుదల నొసగువాడా… (2)

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...