Nee pilupe naa dari chere | నీ పిలుపే నా దరి చేరే నీతోటి

నీ పిలుపే నా దరి చేరే- నీతోటి నా స్నేహమా 
నీ మనసే నా మది కోరే - ఎనలేని సంబంధమా 
కోటి రాగాలు నే పాడుతున్నా - తీరనేలేదు నా దాహమైన 
నిన్ను చేరేటి సంతోషమా 

1.కోరుకున్నాను నీ ప్రేమనే - దాచుకున్నాను నీ వాక్యమే 
ఎన్ని కాలాలు నే దాటినా - కడలి కెరటాలు నను తాకినా 
ఆలకించావు నా ప్రార్ధన - ఆదరించావు నా యేసయ్య

నీ మాటే నాలో మెదిలే - దినమెల్ల నీ ధ్యానమే
అణువణువు నాలో పలికే - నీ స్తోత్ర సంకీర్తన 
కోటి రాగాలు నే పాడుతున్నా - తీరనేలేదు నా దాహమైన 
నిన్ను చేరేటి సంతోషమా నీ పిలుపే నా దరి చేరే - నీతోటి నా స్నేహమా 

2.చేరుకున్నాను నీ పాదమే - వేడుకున్నాను నీ స్వాంతనే 
జీవ గమనాల సంఘర్షణ - అంతరంగాన ఆవేదన
తెల్లవారేను నీ నీడన - పొందుకున్నాను నీ దీవెన

నీ పిలుపే నా దరి చేరే - నీతోటి నా స్నేహమా 
నీ మనసే నా మది కోరే - ఎనలేని సంబంధమా 
కోటి రాగాలు నే పాడుతున్నా - తీరనేలేదు నా దాహమైన 
నిన్ను చేరేటి సంతోషమా

No comments: