170
క్రీస్తుని దయ
రా - ముఖారి, తా - ఆది
యేసుక్రీస్తు ప్రభువా - మేము నీ - మోక్షముఁ బొందుటకు = దోసపు లోకము - లోనికి వచ్చితి - దోషులఁ బ్రోచుటకు ||యేసు||
1.పరిశుద్ధుఁడ వీవు - ఇలలో - పాపుల నందరిని = పరిపరివిధ - కృప - వాక్కులతోడను - పిలిచితి వెల్లప్పుడు ||యేసు||
2.సత్యపు నడతలతో - జగతిని - సర్వాద్భుతములను = నిత్యముఁ జేయుచు - నీ కృప చాల - యిలలోఁ దెల్పితివే ||యేసు||
3.అతి పుణ్యాత్ముఁడవే - ¹క్షితిలో - ²వెతలను బొందితివే = మృతిని బొందియు - మూఁడవ దినమున - బ్రతికియు లేచితివే ||యేసు||
4.పాపుల మని తెలిసి - నీదగు దాపున జేరఁగనే = పాపముఁ బాపుచు ప్రాపుగ నుండెడి - ప్రభుఁడవు నీవెగదా ||యేసు||
5.³దురిత వితతి దూరా - నమ్మిన - దురితుల స్నేహితుఁడా = నిరతము మమ్మును - నీ కృప లోపల - నిలకడగాఁ బెంచు ||యేసు||
6.నోరు నిండ నెదలో - నీ కృప - ప్రేరేపణఁగలిగి = సారెకు వేఁడెద - ⁴ముర్వికి రక్షణ - కారకుఁడా నిన్ను ||యేసు||
– గొల్లపల్లి నతానియేలు
------------------------------------------
¹భూమిలో. ²కష్టములను. ⁴పాప సమూహమునకు దూరమైన వాడా. ⁴భూలోకమునకు.
No comments:
Post a Comment