172
యేసే మన సమస్తము
రా - నవ రోజు, తా - ఆది
యేసుక్రీస్తు దొరికె నేని - యేమికొదువింకేమి భయము = దోసకారి జనుల కెంతోఁ - గ్రాసమవునా యేసు పేరు ||యేసు||
1.తల్లిదండ్రులకన్న చాలాఁ దన ప్రేమ మనమీద = నెల్లకాలమందు నుంచు - యేసుఁడే మా తండ్రియౌను ||యేసు||
2.వల్లగాని వశములేని - యెల్ల మేళ్లన్నిటి నెల్లపుడు = కొల్లగా మన కిచ్చెడి దేవ - కొమరుఁడే వేరెవరు లేరు ||యేసు||
3.దండియైన గండములు - మెండుగాను మముఁజుట్టిన = తండ్రివలె మా దరికి వచ్చి - గండములను గదిమిఁ బ్రోచున్ ||యేసు||
4.సత్యము మార్గముతానె - నిత్యజీవమింకా తానే = భ్రుత్యుల మనకీయ మోక్షము - భువిని రక్తమంత గార్చె ||యేసు||
5.ఎన్నరాని పాపాత్ముల - కన్నులారా కనికరించి = పున్నెమైన తన ప్రాణము - భువిని బలిపెట్టినాఁడు ||యేసు||
6.ఒడలు నిండా గాయములతో - నడరు చుండమరల లేచి = వెడలి పరమందునుండి - వేడుకలు మాకంపినాఁడు ||యేసు||
7.ఆశతోడఁ తన్ను నమ్ము - యాత్మలకు దర్శనమిచ్చెడి = యేసుతో నింకెవరు సాటి - లేశమైనా లేరుసుండీ ||యేసు||
– గొల్లపల్లి నతానియేలు
No comments:
Post a Comment