Sthuthulapai aaseenuda athyunnatha| స్తుతులపై ఆసీనుడా అత్యున్నత

స్తుతులపై ఆసీనుడా - అత్యున్నత నా దేవుడా (2)
నీ ప్రేమలో నీ ప్రేమలో..
నను నేను మరిచాను నీ ప్రేమలో - నీ నీడలో నీ జాడలో -
మైమరచిపోయాను నేను ||స్తుతులపై||

1.నీవు చేసిన ఆశ్చర్య కార్యాలకు బదులు - నీవు పొందిన గాయాలకు బదులు (2)
బంగారం వజ్రాలు - మకుటాలు కిరీటాలు - వెండి నడుగలేదు నీవు
విరిగి నలిగి - కరిగి వెలిగే - హృదయాన్నే కోరావు నీవు (2)
ఓ మాట సెలవియ్యి దేవా - నీ పాద ధూళిని కానా ప్రభువా
నీ పాదం స్పర్శించగానే - నా సంతోషానికి హద్దుండునా ||స్తుతులపై||

2.నీవు లేచిన పునరుద్ధాన దినము మొదలు - మా బ్రతుకులో విజయము మొదలు (2)
మరణం అనేటి ముల్లును విరచి - తిరిగి లేచావు నీవు
చీకటి నిండిన మాదు బ్రతుకులో - వెలుగులు నింపావు నీవు (2)
నీకోసం ఏదైనా దేవా - నే వెచ్చింప సంసిద్ధమయ్యా
ఆఖరికి నా ప్రాణమైనా - చిందులు వేస్తూ అర్పిస్తా ||స్తుతులపై||
-----------------------
Sthuthulapai Aaseenuda - athyunnatha naa devuda (2)
Nee premalo... nee premalo..
Nanu nenu marichaanu nee premalo - nee needalo nee jaadalo - maimarchipoyanu nenu ||Sthuthulapai||

1.Neevu chesina aascharya kaaryaalaku badulu - neevu pondina gayalaku badulu (2)
Bangaaram vajraalu - makutaalu kireetaalu - vendinadugaledu neevu
Virigi naligi karigi velige - hrudayanne koravu neevu (2)
O maata selaviyyi deva - nee paada dhulini kaana prabhuva
Nee paadam sparshinchagane na santhoshaniki haddhunduna ||Sthuthulapai||

2.Neevu lechina punarutthana dinamu modalu -
maa brathukulo vijayamu modalu (2)
Maranamaneti mullunu virachi - thirigi lechavu neevu
Cheekati nindina maadu brathukulo - velugulu nimpaavu neevu (2)
Neekosam edaina deva - ne vechchimpa samsiddhamayyaa
Aakhariki naa pranamaina - chindulu vesthu arpistha ||Sthuthulapai||

No comments: