Rojantha nee paada chentha | రోజంతా నీ పాద చెంత

రోజంతా నీ పాద చెంత - నేనుండ నా కోరిక
దినమెల్ల నా తోడుగా - నీవుంటే ఓ వేడుక (2)

1.నిను చూసే కనులు - స్తుతియించే గళము - 
ప్రేమించే హృదయము - స్పందించే మనసు - 
దేవా నీవే దయచేయుము - నిన్ను కీర్తింప నేర్పు ప్రభు (2)

జీవితాంతం నీ వాడిగానే - నేనుండ నా కోరిక
ప్రతి నిత్యం నీ రూపమే - నా మదిలో మెదలాలిక ||రోజంతా||

2.నీ సైనికుడనై - నే పోరాడెదను - 
నా శక్తంతయు - నా యుక్తంతయు - 
నీకై వెచ్చింప సంసిద్ధుడను - నన్ను దీవింప పంపు ప్రభూ (2)

అతి త్వరలో జనులెల్లరు - నిన్నెరుగ నా కోరిక
ఒకమారు వారందరును - నిను పొగడ చూడాలిగా ||రోజంతా||
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: