Ninne thalachi ninne valachi | నిన్నే తలచి నిన్నే వలచి

నిన్నే తలచి నిన్నే వలచి - దేవుడే మనుష్యుడైన చిత్రము చూడుమా 
ఆ దేవుడే దీనుడైన చిత్రము చూడుమా 
అప:హృదయమా హృదయమా - 
నా హృదయమా యేసయ్య ప్రేమను గాంచుమా
ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా 
యేసయ్య స్నేహము కోరుమా ||నిన్నే||

1.స్థిరమే లేని మనుష్యుల ప్రేమలు - నటనయే చూపుచు కదిలే బొమ్మలు (2)
కలుగ జేయునే నీకు గాయము - చేయలేవులే ఏ సాయము 
గాయలన్ని గేయాలుగా మార్చును 
నీకు యేసయ్య సాయమిచ్చి హాయినిచ్చి కౌగిట దాచును మెస్సయ్య 
నీలో నిలిచి నీతో నడిచి మార్గమే చూపిన మంచి దేవుడు 
అనురాగమే పంచిన ఆత్మీయుడు (2) ||హృదయమా||

2.రేపటి తలపుతో నేడే కలతతో - కృంగుట ఎందుకు కలవరమొందకు (2)
నమ్మదగినవాడు నీ దేవుడు - సర్వకాలము నిన్ను విడువడు 
వాగ్దానమే నీకుండగ - భయమేలనే ప్రాణమా
వర్ణింపగ సాధ్యమా నీపైన యేసయ్యకున్న ప్రేమ 
నిన్నే పిలిచి తనలా మలచే యేసుపై ఆనుకో నా ప్రాణమా 
ఆ యేసునే నమ్ముకో అంతరంగమా (2) ||హృదయమా||
---------------------------------
Ninne thalachi ninne valachi - devude manuṣyuḍaina chitramu chūḍumā ā dēvuḍē dīnuḍaina citramu cūḍumā anupallavi; hr̥dayamā hr̥dayamā - nā hr̥dayamā yēsayya prēmanu gān̄cumā prāṇamā prāṇamā nā prāṇamā yesayya snehamu koruma ||Ninne||

1.Sthiramē lēni manuṣyula prēmalu naṭanayē cūpucu kadilē bom'malu (2) kalugajēyunē nīku gāyamu cēyalēvulē ē sāyamu gāyalanni gēyālugā mārcunu nīku yēsayya sāyamicci hāyinicci kaugiṭa dācunu mes'sayya nīlō nilici nītō naḍici mārgamē cūpina man̄ci dēvuḍu anurāgamē pan̄cina ātmīyuḍu (2) ||hrudayama||

2.Rēpaṭi talaputō nēḍē kalatatō kr̥ṅguṭa enduku kalavaramondaku (2)
nammadagina vāḍu nī dēvuḍu sarvakālamu ninnu viḍuvaḍu vāgdānamē nīkuṇḍaga- bhayamēlanē prāṇamā varṇimpaga sādhyamā nīpaina yēsayyakunna prēma ninnē pilici tanalā malacē yēsupai ānukō nā prāṇamā ā yēsunē nam'mukō antaraṅgama (2) ||hrudayama||

No comments: