Neevu thappa Naakeelokamlo | నీవు తప్ప నాకీ లోకంలో

నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా 
నీకు తప్ప నాలో ఎవరికీ చోటే లేదయ్యా (2) 
దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా 
నజరేతు వాడా నను విడిచిపోకయ్యా (2)|| నీవు ||

1. గ్రుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా
మూగవాడినయ్యా నా స్వరమునీయవా (2)
కుంటివాడినయ్యా నా తోడు నడువవా (2)||దావీదు||

2. లోకమంత చూచి నను ఏడిపించినా 
జాలితో నన్ను చేరదీసిన (2) 
ఒంటరినయ్యా నా తోడు నిలువవా (2) ||దావీదు||

నా తల్లి నన్ను మరచిపోయినా 
నా తండ్రి నన్ను విడచిపోయినా (2) 
తల్లిదండ్రి నీవై నన్ను లాలించవా (2) ||దావీదు||

No comments: