Manasa nee priyudu yesu | మనసా నీ ప్రియుడు యేసు

మనసా నీ ప్రియుడు యేసు నీ పక్షమై నిలిచెనే మహదానందమే తనతో జీవితం
ఓ మనసా ఇది నీకు తెలుసా !

1.దివ్యమైన సంగతులెన్నో నీ ప్రియుడు వివరించగా
ఉత్సాహ ధ్వనులతో వూరేగితివే 
ఉరుముల ధ్వనులన్నీ క్షణికమైనవేగా 
దిగులు చెందకే ఓ మనసా ||మనసా|| 

2.ఆశ్చర్య కార్యములెన్నో నీప్రియుడుచేసియుండగా 
సంఘము ఎదుట నీవు సాక్షివైతివే 
ఇహలోక శ్రమలన్ని స్వల్పకాలమేగా 
కలవరమేలనే ఓ మనసా ||మనసా||

3.నిష్కళంకరాలవు నీవని నీప్రియుడు నిను మెచ్చెనే 
కృపాతిశయముచే నీవు ఉల్లసించితివే
దుష్టుల క్షేమము నీకంట బడగా 
మత్సరపడకే ఓ మనసా ||మనసా||
--------------------------------------------
Manasa nee priyuḍu yesu nee pakṣhamai nilichene mahadanandame thanatho jeevithaṁ o manas idi neeku thelusa

1.Divyamaina sangatulenno nee priyuḍu vivarinchaga 
Uthsaha dhvanulato vuregitive 
Urumula dhvanulanni ksanikamainavege
Digulu chendake o manasa ||Manasa|| 

2.Ascharya karyamulenno nee priyudu chesiyundaga
Sanghamu eduta neevu saksivaitive ihaloka shramalanni svalpakalamega kalavaramelane o manasa ||Manasa||

3.Nishkalankaralavu neevani nee priyudu ninu mechene
Krpathishayamuche neevu ullasinchitive
Dushtula kshemamu nee kanta baḍagā matsarapaḍake o manasa ||Manasa||

No comments: