Yesu rakshaka prana snehitha | యేసు రక్షక ప్రాణ స్నేహిత

యేసు రక్షక - ప్రాణ స్నేహిత (2) … 
నిన్ను విడిచి క్షణమైనా - బ్రతుకలేనయ్యా 
నీ మాట లేక నిమిషం - జీవించలేనయ్య (2) - 
నా జీవము నీవే - నా ప్రాణము నీవే నా సర్వము నీవే - యేసయ్యా (2) ||యేసు||
 
1.కన్నతల్లి చంటి బిడ్డను మరచిన మరచున్ -
నేను నిన్ను మరువనంటివే (2)
తండ్రి ప్రేమ దూరమైన దూరమవును - 
అనాధలుగా విడువనంటివే (2)
నా తల్లియు నీవే - నా తండ్రియు నీవే 
నా సర్వము - నీవే యేసయ్యా (2)
 
2.శత్రువులు వెంటపడి తరుముకొచ్చినా - 
భయపడకు జడియకంటివే (2) 
కృంగదీసే శ్రమలు నన్ను చుట్టుకొచ్చిన - 
కృప నిన్ను విడువదంటివే (2)
నా జ్ఞానము నీవే నాధైర్యము నీవే - 
నా సర్వము నీవే యేసయ్యా (2)
 
3.వ్యాధులు నా వంటినిండా బాధించగా - స్వస్థపరచు వాడనంటివే (2)
ఐశ్వర్యం ఇంటి నుండి దూరంమవగా - నావన్నీ నీవంటివే (2)
నా బలము నీవే నా ధనము నీవే -
నా సర్వము నీవే యేసయ్య (2)

No comments: