Karunasaagara veevekava | కరుణసాగర వీవేకావా

206
సిలువ శ్రమలు
రా - రేగుప్తి,   తా - అట

¹కరుణసాగర వీవేకావా - మరణమొంద సిల్వ మెట్టకు మోసినావా = కరుణ సాగర వీవెకావ =  మరియు కల్వరి మెట్టమీఁదను కడకు మేకులుఁ గొట్టబడి నీ - మరణరక్తము చేత నరులకు - పరమరక్షణఁ దెల్పినావా ||కరుణ||

1.నజరేతు పుర ²విహారా - నరులఁ బ్రోవ ³నరు దెంచినావా = నజరేతు పురవిహారా = ప్రజలపాపముఁ బరిహరించియు - ప్రజల ⁴సద్గతి నొందఁ జేయను - విజయమునుఁ బొందితివి యిలలో - సజనులందరు భజనసేయఁ గ ||నజరేతు||

2.మరియయనే కన్యకుమారా - నరకబాధఁ దప్పించినావా = మరియయనే కన్యకుమారా - మార్గసత్యము జీవనములీ - మహిని నమ్మిన వారి కెల్లను - మీరెగాకిఁక వేరేలేరని - సారెసారెకుఁ జెప్పినావా ||మరియయనే||

3.మహిలోను మనుజకుమారా - యహా తండ్రిని వేడినావా = మహిలోను మనజకుమారా = యిహములో నిను నమ్మువారిని - బహు నీ కటాక్షంబుచేతను - మహిమజనకా గావుమనుచు - ⁵త్రాహియని బ్రార్ధించి నావా ||మహిలోను||

4.పరమతండ్రి ప్రియకుమారా - ⁶పావనముజేయ మీరేకారా = పరమతండ్రి ప్రియకుమారా = పరముడా నీ పంచ గాయము ⁷లరయగా రక్తముతో నిండెను - ధరను మా పాపములుఁ - గడుగను - ⁸చిరముగా ను ⁹త్త రమునాయె ||పరమతండ్రి||
              – గొల్లపల్లి నతానియేలు
______________________________
¹ప్రేమయనే సముద్రము. ²సంచరించిన వాడా. ³వచ్చినావా. ⁴మంచిస్థితి. ⁵కృప చూపించుము. ⁶పరిశుద్ధులుగాజేయు. మాయెను. ⁷చూడగా. ⁸స్థిరముగా. ⁹ఆదర్శమాయెను.

No comments: