136
వేరొక నామమున రక్షణ లేదు
రా - యమునా కళ్యాణి, తా - త్రిపుట
యేసు నామామృతము కన్నను - వేరే మాకిఁక లేదుగా = దోసముల నెడబాపి పరమని - వాస పదవికిఁ జేర్చుఁగా ||యేసు||
1.నిత్య రక్షణ నిత్య జీవము - నిజముగా మాకిచ్చును = సత్యసువిశేషార్థసారము - సతము గ్రోలుట కొసఁగెను ||యేసు||
2.దురిత భవ మను నంధకారము - దూరముగఁ బోఁదోలెఁగా = అరయఁ దన విమలాత్మ వరమున - మరల మము వెలిఁగించెఁగా ||యేసు||
3.గొప్ప కుల గర్వముల మెప్పను - తప్పుల న్విడఁగొట్టెను = చెప్ప శక్యముగాని రక్షణ - సృష్టిలో మము నిల్పెను ||యేసు||
4.అడ్డు పరచు పిశాచి మార్గపు జిడ్డులను ఛేదించెను = దొడ్డ కాపరి యేసు తన దగు - దొడ్డిలో మముఁ జేర్చెను. ||యేసు||
– గొల్లపల్లి నతానియేలు
No comments:
Post a Comment