137
యేసు నామము మధురము
రా - మరవా, తా - ఆది
యేసు నామ - మెంతో మధురం - యేసు నామ - మెంతో మధురం = దోసములు మోసములు - నాధ మొనరించు ప్రభు ||యేసు||
1.స్వాంతమునకు - శాంతి నిడును = చింతలను భ్రాంతులను - వింతలుగఁ ద్రుంచు ప్రభు ||యేసు||
2.నెమ్మి జేయు కమ్మివేయు = నమ్మికలు సొమ్ములుగ - ముమ్మరము జేయు ప్రభు ||యేసు||
3.ప్రేమ లెదుగ - క్షేమ మొదపు = కామ గుణ పామరతి - లేమి చొరనీదు ప్రభు ||యేసు||
4.మోక్ష దశకు - సాక్ష్య మొసఁగు = నక్షయ సురక్షణకు - దక్షత వహించ ప్రభు ||యేసు||
5.శీల మతుల - పాలి వెతలఁ =తూలఁ జనఁదోలి తన - జాలి కనపరచు ప్రభు ||యేసు||
- పురుషోత్తము చౌదరి
No comments:
Post a Comment