Yese bhagavannamam | యేసే భగవన్నామం భజింపను

139
యేసు నామ స్మరణ
రా - అసావెరీ,  తా - ఆది
(ఛాయ: భజో మధుర)

యేసే, భగవన్నామం భజింపను యేసే, భగవన్నామం భజింప నిరంతర ||మేసే||

1.యేసే సుగుణం యేసే శాంతం యేసే మనశ్శాంతం యేసే మనశ్శాంతి భజింపను ||యేసే||

2.యేసే ప్రేమం యేసే క్షేమం యేసే పరంధామం యేసే పరంధామ భజింపను ||యేసే||

3.యేసే తెరవు యేసే పరువు యేసే సద్గురువు యేసే సద్గురువు భజింపను ||యేసే||

4.యేసే నిత్యం యేసే సత్యం యేసే సుఖదాయం యేసే సుఖదాయ భజింపను ||యేసే||

5.యేసే జీవం యేసే జ్ఞానం యేసే జగదీశం యేసే జగదీశం భజింపను ||యేసే||
                     – పి. రవివర్మ

No comments: