05 April 2022

Neevu kaligina korikakai | నీవు కలిగిన కోరికకై వేలాది

నీవు కలిగిన కోరికకై వేలాది వందనాలయ్య 
నీవు చేసిన త్యాగముకై శతకోటి స్తోత్రములయ్యా 

అయ్యా బలియైనవా నా బ్రతుకు కోసం 
నీ ప్రాణం పెట్టావా నాపాపం కొరకు (2)
నీ త్యాగమే మహా అద్భుతం 
అయ్యా నీ త్యాగమే వర్ణించలేం (2) ||అయ్యా బలియైనవా||

1.విలువలేని నాజీవితాన్నే 
మార్చుటకు నీవు బలియైయ్యవా 
మోడు బారిన నాజీవితన్నే 
చిగురింపజేయుటకు వెలియైయావా 
గొప్ప రక్షణ నాకివ్వాలని 
శుద్ధ రక్తాన్నే ధారబోసావా 
నీ శుద్ధ రక్తాన్నే ధారబోసావా 

అయ్యా బలియైనవా నా బ్రతుకు కోసం 
నీప్రాణం పెట్టావా నాపాపం కొరకు (2)
నీ ఆశలకే వందనాలేసయ్యా 
నీ యాగానికే స్తోత్రాలేసయ్యా (2) ||అయ్యా బలియైనవా||

2.నీ ముఖము మీద ఉమ్మి వేసిన 
నీ నిర్ణయాన్నే మార్చుకోలేదయ్యా 
మోయలేని భారాన్ని మోసిన 
ఇచ్చిన మాట తప్పలేదయ్య 
చిత్రహింసలే అనుభవించినా 
చావుకు నీవు తలవంచలేదయ్యా 
చావుకె నీవు తలవంచలేదయ్యా 

అయ్యా బలియైనవా నా బ్రతుకు కోసం 
నీప్రాణం పెట్టావా నాపాపం కొరకు (2)
నా కోసమే కదా ఈ సిలువ యాగం 
నీ నిర్ణయమే గొప్ప సమర్పణ అయ్యా (2)

రచన,స్వరకల్పన,గానం - Bro. T. ప్రవీణ్ పాల్
This song available on YouTube
https://youtu.be/Ke7eAPVnS8I

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...