Yehova Yire Nanu Chusevaada | యెహోవా యీరే నను చూసేవాడా

యెహోవా యీరే నను చూసేవాడా - నీవుండుటయే చాలు
యెహోవా రాఫా స్వస్థ ప్రదాత - నీ గాయమే బాగు చేయు
యెహోవా షమ్మా తోడుండువాడా - నా అక్కరలను తీర్చు
నా వెంట నీవు తోడుంటే చాలు - నీవుంటే చాలు నాకు (2)

యెహోవా ఎలోహిం నా సృష్టి కర్తా - నీ వాక్కుయే ఈ సృష్టి
యెహోవా ఎలైన్ మహోన్నతుడా - నీకు సాటి లేరెవరు
యెహోవా షాలోమ్ శాంతి ప్రదాత - నా హృదిలోనికి రమ్ము
నా వెంట నీవు తోడుంటే చాలు -నీవుంటే చాలు నాకు (2)

యెహోవా ఎల్ షద్దాయి బహు శక్తిమంతుడా - నా బలమే నీవు కదా
యెహోవా రోహి నా మంచి కాపరి - నీ కరుణతో కాపాడు
యెహోవా నిస్సి జయమిచ్చు దేవా - నాకభయము నీవే ప్రభు
నా వెంట నీవు తోడుంటే చాలు - నీవుంటే చాలు నాకు (4)

No comments: