Sambaramenanta yesayya puttenanta | సంబరమేనంట యేసయ్య పుట్టెనంట

సంబరమేనంట యేసయ్య పుట్టెనంట
సందడి చేద్దామంతా ఊరువాడ తెలిసేటంత (2) 
యూదుల రాజు ఇమ్మానుయేలు (2)
పరమువీడి భువికొచ్చెనట 

ఇది యేసయ్య జనన వేడుక - జనులందరికీ మహాపండుగ (2)

1. పాపమెలేని పరిశుద్ధుడు కన్య గర్భమున జన్మించాడు
ప్రజలందరినీ రక్షించుటకు ఈ భువిపైనే అరుదెంచాడు 
ఆ దేవదేవుడే రిక్తునిగా మారి నీ నా దరి చేరాడు (2) ||ఇది యేసయ్య||

2. నీతి సూర్యుడు ప్రభుయేసు ఉదయించాలి ప్రతి హృదయంలో- 
మారుమనస్సుకు తగిన ఫలము ఫలియించాలి ఈ అవనిలో (2)
క్రీస్తు నీలో జన్మిస్తే అదియే నిజ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ
క్రీస్తు నీలో జన్మిస్తే అదియే నిజ క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్ ||ఇది యేసయ్య||

No comments: