దివినే విడచి భువికే వచ్చిన నా యేసయ్య
ఆ దివికే నిన్ను నన్ను చేర్చగా జన్మించాడయ్యా (2)
తూర్పు దిక్కు చుక్క మెరిసేలే - చిన్నారి యేసు జాడతెలిపెలే
బెత్లహేము సంతోషించేలే - రక్షకుండు యిలజన్మించేలే బంగారు సామ్రాణి భోలంబు తెచ్చామే -
మనసారా బాల యేసుని సుత్తియింప వచ్చామే
ఊరంతా సంబరమాయేలే
రండి రండి పోదాము రారాజుని చూద్దాము -
రండి రండి పోదాము తరియిద్దాము (2)
1. దివినుండి దూతలు వచ్చి భయపడవద్దన్నారే
ఈ భూవికి కలుగబోవు శుభవార్తను తెలిపారే
అది విన్న గొల్లలు పరుగున యేసయ్యను చేరారే - పాటలతో నాట్యంతో ప్రభువుని కీర్తించారే
రక్షకుడు యేసయ్యే రారాజుగా వచ్చాడే - చిన్న పెద్ద అంతా కలిసి పూజిద్దాం రారండోయ్ (2) ||రండి రండి||
2. చిరునవ్వుల చిన్ని యేసు చిత్రంగా భువి చేరెలే - పశువుల పాకే నేడు పరలోక సన్నిదాయే
దీనుడిగా ఉదయించాడే - మహిమత్వం విడిచాడే
తన ప్రేమను మనకై చూప దయతో దిగి వచ్చాడే
పరమే విడిచి నీకై నాకై నరునిగా వచ్చాడే - చీకు చింతలు పాపం పోవును పూజిద్దాం రారండోయ్ (2) ||రండి రండి||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment