11 December 2021

Daveedu vamshamulo bethlemu దావీదు వంశంలో బెత్లేము

దావీదు వంశంలో బెత్లేము గ్రామములో

దావీదు వంశంలో - బెత్లేము గ్రామములో యేసయ్యా జన్మించెను - యేసయ్య కథ వింటే రక్షణ కలుగును -  మార్గము సత్యం జీవము (2)

ఇది ఇమ్మనుయేలుని ధన్య చరితం - పరిశుద్ధ దేవుని దివ్య రచితం - నమ్మిన వారికి కలుగును జీవము - పరిశుద్ధ ఆత్ముని కార్య ఫలితం

గొల్లలు జ్ఞానులు చాటారు రక్షకుని
మహిమ పరిచిరి సాక్ష్యములు ఇచ్చిరి
హల్లెలూయ హల్లెలూయ దూతల గానాలు
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ రక్షణ స్తోత్రాలు
అరె హల్లెలూయ హల్లెలూయ

1. క్రీస్తు జన్మము మార్చింది చరితను - క్రీస్తు శకముగ ప్రారంభము - చీకటి రాజ్యముకు అంతము కలిగెను - దైవ రాజ్యము ఆరంభము (2)
పాత బ్రతుకును క్రొత్తదిగా మార్చును - మరణచ్చాయలు అంతమగును - అంతమే లేని జీవము నీకిచ్చును - ఆది అంతము ఆ ప్రభువు ||గొల్లలు||

2. జీవహరమును జీవజలమును నేనే - మంచి కాపరిని నేనన్నాడు - భారమంతయు నాపైన మోపితే - నిత్యం భరియిస్తా నేనన్నాడు (2)
దిగులుచెందకు ఆనందించు నాలో - నీ స్నేహితుడ నేనన్నాడు - మరల హృదయంలో తిరిగి నీవు జన్మిస్తే - దేవుని రాజ్యంలో చోటన్నాడు  ||గొల్లలు||

DOWNLOAD MP3 SONG HERE 👇

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...