సమూయేలు...సమూయేలు

🙏ప్రభువు నామములో అందరికి శుభములు🙏
⛪నేటి ధ్యానము⛪

✝️సమూయేలు...సమూయేలు✝️

యెహోవా సమూయేలును పిలిచెను. అతడుచిత్తమండి నేనున్నానని చెప్పి ..
1 సమూయేలు 3 : 4

యెహోవా మరల సమూ యేలును పిలువగా సమూయేలు లేచి ఏలీయొద్దకు పోయి.- 
1 సమూ  3 : 6

యెహోవా మూడవ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి. 
1 సమూ 3 : 8

    ఆదివారపు బడి ఉపాధ్యాయురాలు పిల్లలకు చిన్న బాలుడైన సమూయేలు కథ చెప్తుంటే, పిల్లలు అందరూ చాలా ఆసక్తితో వింటున్నారు. వాళ్లు కళ్లు పెద్దవిగా చేసుకుని చెవులు ఆనించి మరి అలాగే వింటున్నారు, చివరకు ఆ టీచర్ “మీరు కూడా నమ్మకం గా ఉన్నట్లయితే దేవుడు మిమ్ములను కూడా పేరు పెట్టి పిలుస్తున్నారు” అని ముగించింది.

    సాధారణంగా మంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టిన పిల్లలు అందరు కథ వింటూ ఉంటారు. సమూయేలు తల్లి ఆ బాలుడు చాలా చిన్నవాడైనప్పటికీ ఆలయంలో దేవుని సేవ నిమిత్తమై విడిచి వెళ్ళింది. ఆ సమయంలో ప్రధాన యాజకుడైన ఏలీ యొక్క ఇద్దరు కుమారులు యెహోవా దృష్టిలో మంచి వారుగా లేరు. సమూయేలు చాలా చిన్నవాడైనప్పటికీ దేవుడు అతనితో వారి గురించి మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు.

     దీని నుండి మనకు అర్థమయ్యేది ఏంటంటే మన వయసుతో సంబంధం లేకుండా దేవుడు మనలను పిలుస్తారు. మనం ఎప్పుడైతే సంపూర్ణంగా ఆయన సేవ నిమిత్తమై సమర్పించుకుంటామొ అప్పుడు ఆయన మనలను పేరు పెట్టి పిలుస్తారు, ఇంకా రాబోయే సంగతులను కూడా మనకు తెలుపుతారు. దేవునికి నిన్ను నీవు సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన స్వరం వినడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన యొద్ద నుండి ప్రవచనాలు వినడానికి సిద్ధంగా ఉన్నావా? అవును అనేది మీ సమాధానం అయితే ఆయన పేరు పెట్టి పిలిచి నీతో మాట్లాడుతారు.

🛐ప్రార్ధన:🛐

    ప్రియ ప్రభువా మీరు పిలిచినప్పుడు మీ వాక్కును వినడానికి సమూయేలు యొక్క చెవులు మాకు ఇవ్వండి. మీ వాక్కుకు లోబడే హృదయ మాకు ఇవ్వండి. మీకు ఇష్టమైన, మీ దృష్టికి మంచిదైనా ఒక జీవితాన్ని మాకు ఇవ్వమని యేసు నామములో ప్రార్ధన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్!

👉దేవుడు మనలను ఒక పని చేయడానికి పిలిస్తే, దానికి మనలను అర్హులుగా చేస్తారు. – జాక్ హైల్స్

No comments: