104
క్రీస్తు నరావతార సందేశము
రా - యదుకులకాంభోజి, తా - ఆది
వినరే యో నరులారా - వీనుల కింపు మీర - మనల రక్షింప క్రీస్తు - మనుజావతారుఁ డయ్యె - వినరే = అనుదినమును దే - వుని తనయుని ¹పద - వనజంబులు మన - మున నిడికొనుచును ॥వినరే ॥
1. నరరూపుఁ బూని ²ఘోర - నరకుల రారమ్మని - దురితముఁ బాపు దొడ్డ - దొరయౌ మరియా వరపుత్రుఁడు = ³కర మరు దగు క - ల్వరి గిరి దరి ⁴కరి - గి ⁵రయంబున ప్రభు - కరుణను గనరే ॥వినరే ॥
2. ఆనందమైన మోక్ష - మందరి కియ్య ⁶దీక్ష - బూని తనమేని సిలువ - మ్రాను నణఁచి మృతిఁ బొందెను = దీన దయా పరుఁ - డైన మహాత్ముఁడు - జానుగ - యాగము సలిపిన తెరంగిది ॥వినరే ॥
3. ⁷పొందుఁ గోరిన వారి - ⁸విందా పరమోపకారి - యెంద రెందరిఁ బరమా - నందపద మొందఁగఁ జేసెను = అందమునన్ దన - ⁹బొంది సురక్తము - జిందెను భక్తుల - డెందము గుందఁగ ॥వినరే ॥
4. ఇల మాయావాదుల మాని - యితఁడే సద్గురు డని - తలపోసి చూచి మతి ని - శ్చల భక్తిని గొలిచిన వారికి = నిల జనులకు ¹⁰గలు - ములనలరెడు ధని - కుల కందని సుఖ - ములు మరి యొసఁగును ॥వినరే ॥
5. దురితము లణఁప వచ్చి - మరణమై తిరిగి లేచి - నిరత మోక్షానంద సుం-దర మందిరమున కరుదుగఁ ¹¹జనె = ¹²బిరబిర మన మం - దర మా కరుణా - ¹³శరనిధి ¹⁴చరణ మె - శరణని పోదము ॥వినరే ॥
- పురుషోత్తమ చౌధరి
_______________________________
¹తామరపువ్వులవంటి పాదములు. ²భయంకరులగు. ³మిక్కిలి ఆశ్చర్యకరమైన. ⁴వెళ్లి. ⁵త్వరగ. ⁶శ్రద్ధతో. ⁷సహవాసము. ⁸బంధువు. ⁹శరీరము యొక్క ¹⁰సంపదలతో నొప్పుచున్న. ¹¹వెళ్లెను. ¹²త్వరగ. ¹³సముద్రము. ¹⁴పాపమే.
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment