Vetakaani Urilonundi | వేటగాని ఉరిలో నుండి


వేటగాని ఉరిలో నుండి - నా ప్రాణాన్ని రక్షించావు
బలమైన రెక్కల క్రింద - నాకాశ్రయమిచ్చావు (2)

లేనే లేదయ్యా వేరే ఆధారం - నా దుర్గమా నా శైలమా
లేనే లేదయ్యా వేరే ఆధారం - నా శృంగమా నా కేడెమా
ఆరాధన ఆరాధన – నా తండ్రి నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన – నా యేసు నీకే ఆరాధన (2)

రాత్రి వేళ భయముకైననూ - పగటి వేళ బాణమైననూ
రోగము నన్నేమి చేయదు - నా గుడారము సమీపించదు (2) ||లేనే లేదయ్యా||

వేయిమంది పడిపోయినా - పదివేల మంది కూలిపోయినా
అపాయము రానే రాదు - నా గుడారము సమీపించదు (2) ||లేనే లేదయ్యా||

మానవులను కాపాడుటకు - నీ దూతలను ఏర్పరిచావు
రాయి తగలకుండా - ఎత్తి నన్ను పట్టుకున్నావు (2) ||లేనే లేదయ్యా||

No comments: