14 October 2021

Nee Sannidhiye Naa Aashrayam | నీ సన్నిధియే నా ఆశ్రయం


నీ సన్నిధియే నా ఆశ్రయం నీ నామమే నా ఆధారం (2)
స్తోత్రింతును, నిన్ను మరువను నీ వాక్యమే నా దీపము (2) హల్లెలూయా , హల్లెలూయా (2) 

చీకటి లోన నే సాగితిని పాపనికి రూపముగా నే మారితిని (2)
అంతులేని వాంఛలతో అంధురాలనయితి సాతానుకు ప్రియమయిన బంధువునయితి (2)
నీ వెలుగుతో నను నింపితివి నీ రక్తముతో నను కడిగితివి (2) || హల్లెలూయా ||

నీ నామము పలికే అర్హత లేదు నీ ప్రేమను పొందే యోగ్యత లేదు (2)
నా భారము మోసి నను కాచితివి శోధనలన్నింటి లోన కాపాడితివి (2)
నిను పొగడక బ్రతుకుట ఎలా ? నిను వదిలి నేను అడుగిడ జాల (2) || హల్లెలూయా ||

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...