12 October 2021

సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము! – కీర్తనలు -133 : 1

🙏ప్రభువు నామములో అందరికి శుభోదయం.🙏..
⛪నేడు దిన ధ్యానము:-⛪

✝️(((సహోదరుల మధ్య ఐక్యమత్యం)))✝️

  సహోదరులు ఐక్యత కలిగి నివసించుట   ఎంత మేలు! ఎంత మనోహరము! 
 – కీర్తనలు - 133 : 1 

మనమందరము చిన్నతనంలో ఒక కథ వినే ఉంటాం. మరణ పడక మీద ఉన్న ఒక తండ్రి తన ముగ్గురు కొడుకులను పిలిచి ఒక్కొక్కరికి ఒక కర్ర ఇచ్చి దాన్ని విరవమంటాడు. వాళ్లు దాన్ని సులభంగా విరిచి వేశారు. దాని తరువాత తండ్రి కర్రల కట్ట అంటే చాలా కర్రలు కలిపి ఇఛ్చి విరవమంటాడు. వాళ్లు విరవ లేకపోయారు. అందుకే ‘అందరూ కలిసి ఉండండి, ముగ్గురు కలిసి ఉంటే మిమ్ములను ఎవ్వరూ విరువ లేరు, ఏమీ చేయలేరు’ అని చెప్తాడు.

ఈ కథలో చాలా నీతి ఉంది. అదే విధంగా గొర్రె పిల్ల సంఘమైన మనము అందరము కలిసి ఉండాలి. ఈ రోజుల్లో అనేక సంఘాలు, సంస్థలు, ఆరాధన మందిరాలు, శాఖలు ఉంటున్నాయి. క్రైస్తవులు, పాస్టర్లు ఒకరినొకరు నిందించుకుంటూ ఉన్నారు. అందుకే బయటవాళ్లు మనలను సులభంగా విరిచి వేస్తున్నారు. మనమందరము కలిసి ఐకమత్యంగా ఉంటే మనలను ఎవరూ విడదీయలేరు. పాడు చేయలేరు. అంతే కాదు మనతో వాళ్లు కలిసిపోతారు. మనమందరము వేర్వేరు సంఘాలకు చెందిన వారము. మనము మన సంఘమే గొప్పది అని అనుకుంటున్నాము. అలాంటి ఆలోచనలు మాని, ఒకరినొకరు విమర్శించుకోవడం ఆపివేసి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మనమందరము కలిసి ఉండడానికి పరిశుద్ధాత్ముడు సహాయము చేయును గాక. ఆమెన్!

🛐ప్రార్థన:🛐
పరలోకపు తండ్రి మాకందరికీ ఒకే హృదయము, ఒకే మనస్సు, క్రీస్తునందు ఓకే శరీరము ఉండులాగున దయచేయండి. ఒకరినొకరు ప్రేమించు కొనడానికి పరిశుద్ధాత్మ దేవా సహాయం చేయమని యేసు నామములో ప్రార్ధన చేస్తున్నాము పరమ తండ్రి . ఆమెన్.

👉మనము కలిసి ఉంటే ఎంత బలంగా ఉంటామో, విడిపోతే అంతే బలహీనమై పోతాం. – జె.కె. రౌలింగ్

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...