శిష్యులనుగా చేయుడి

🙏ప్రభువు నామములో అందరికి శుభోదయం🙏...
⛪ నేటి దిన ధ్యానము⛪

✝️ *శిష్యులుగా చేయండి* ✝️

కాబట్టి మీరు వెళ్లి, 
సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్దాత్మ యొక్కయు నామములోనికి 
వారికి బాప్తీస్మమిచ్చుచు వారికి భోధించుడి. 
మత్తయి 28:19-20.

“ఆత్మలను సంపాదించడం ఈ ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన సంగతి. యేసయ్య దగ్గరకు నీవు తెచ్చిన ప్రతీ ఆత్మ ద్వారా, ఈ భూమి మీద క్రొత్త స్వర్గాన్ని పొందినట్లు అనుభూతి చెందుతావు” అన్నారు చార్లెస్ స్పర్జన్. అతనికి అత్యంత సంతోషకరమైన సంగతి ఏమంటే, “ఆత్మలను జయించడం”. అతడు “ఉపదేశకులకు రాకుమారుడు” అని పిలువబడ్డారు. 38 సంవత్సరాలు అతడు లండన్ లోని “న్యూ పార్క్ స్ట్రీట్ చాపెల్” అనే మందిరానికి పాస్టర్ గా ఉన్నారు. అతడు చాలా మంచి రచయిత కూడా. అతడే కాదు, అనేక మంది దేవుని సేవకులు, దేవుని రాజ్యం కొరకు ఆత్మలను రక్షించడానికి విస్తారమైన సేవ చేశారు. ఎందుకంటే ప్రతీ ఒక్కరి కొరకు యేసయ్య తన ప్రశస్తమైన రక్తాన్ని కార్చారు. ఆయన శ్రమ పొంది సిలువ వేయబడడం వలన మనకు నిత్యజీవము ఇవ్వబడింది. మనము కూడా మృత్యువును జయించి, సదాకాలము, ఆయనతో కూడా నివసిస్తాము.

యేసయ్య తన తండ్రి దగ్గరికి పరలోకానికి వెళ్లక ముందు తన శిష్యులకు, మరి వారికే కాకుండా, మనకందరికీ, అన్ని దేశాలకూ, అన్ని రాజ్యాలకు సువార్తను ప్రకటించమని చెప్పారు. వాళ్ళు ఎప్పుడైతే యేసు క్రీస్తును, తమ స్వంత రక్షకునిగా అంగీకరిస్తారో, అపుడు మనం వారికి తండ్రి, కుమార, పరిశుద్దాత్మ నామములో బాప్తీస్మము ఇవ్వాలి. అపుడు మనమొక ఆత్మకు (ఒక మానవునికి లేదా మానవురాలికి) నరకానికి వెళ్లకుండా, సదాకాలము యేసయ్యతో జీవించడానికి తోడ్పడతాము. కనుక ఆయన రాజ్యానికి అనేక ఆత్మలను సంపాదించడానికి కష్టపడి పని చేద్దాము.

🛐ప్రార్థన:🛐

ప్రియ పరిశుద్దాత్మ ప్రభువా, మా ద్వారా పని చేయండి. ఇంకా యేసయ్య నామములో గొప్ప అద్భుతాలు మా ద్వారా చేయండి. అపుడు మేము అనేకులను మీ రాజ్యానికి తీసుకవస్తామని యేసు నామములో ప్రార్ధన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్!

👉 ఒక శిష్యుడు మాత్రమే మరియొకరిని శిష్యునిగా చేయగలడు. – ఎ. డబ్ల్యు. టోజర్ .

No comments: