Yevaru Choopinchaleni | ఎవరు చూపించలేనీ ఇలలో నను

ఎవరు చూపించలేనీ - ఇలలో నను వీడిపోనీ 
ఎంతటీ ప్రేమ నీదీ - ఇంతగా కోరుకుందీ 
మరువనూ యేసయ్య 

నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా 
నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా 

1. తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే
ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే 
నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా 
ఏ దారి కానరాక - నీ కొరకు వేచివున్నా 

ఎడబాటులేని గమనాన - నిను చేరుకున్న సమయాన 
నను ఆదరించే ఘన ప్రేమ - అపురూపమైన తొలిప్రేమ 

ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా 
ఎవ్వరూ లేరుగా - యేసయ్య నీవెగా

2. ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా 
విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం 
నీ సన్నిథానమందు - సీయోను మార్గమందు 
నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ 

నీ తోటి సాగు పయనాన నను వీడలేదు క్షణమైన 
నీ స్వరము చాలు ఉదయాన - నిను వెంబడించు తరుణాన 

శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో 
నిత్యము తోడుగా నిలిచె నా యేసయ్య
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: