12 September 2021

రేపటినిగూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును. మత్తయి: 6 : 34


🙏ప్రభువు నామములో అందరికి శుభోదయం🙏
నేటి దిన ధ్యానము

 *(చింతించకు)* 

రేపటినిగూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును
మత్తయి: 6 : 34

నిదానంగా నేను కూడా చింతించడం మాని ప్రతి సమస్యను ఏసయ్య భుజాలమీద మోపడం నేర్చుకున్నాను. ఎవరి జీవితం కూడా సమస్యలు లేకుండా ఉండేది కాదు. కానీ సమస్యను ఎలా ఎదుర్కొంటామనే దాని మీదనే అందరిలోనూ వ్యత్యాసం కనిపిస్తుంది. కనుక మీ చింతలన్నీ ఏసుప్రభువు పైన వేయండి. ఆయనే మీ సమస్యలన్నీ తీర్చుతారు. రేపటిని గురించి ఎప్పుడూ చింతించకండి.

ప్రార్థన:
ప్రభువా దేనిని గురించి కూడా చింతించకుండా కేవలము మీ మీద ఆనుకొని విశ్రాంతి తీసుకునే కృప నాకు అనుగ్రహించండి. సంపూర్ణంగా మీమీదే ఆధారపడటానికి మార్పు నేర్పించండి. మీరు మాత్రమే మా సమస్యలను పరిష్కరించగలరు. కనుక మీ మీద ఆధారపడటానికి నేర్పమని యేసు నామములో ప్రార్ధన చేస్తున్నాము పరమ తండ్రి ఆమెన్.

నేను వెనక్కి తిరిగి నా చింతలన్నీ గమనించుకుంటే నాకు ఒక మరణశయ్యపై ముసలాయన మాటలు గుర్తు వస్తున్నాయి. ఆ ముసలాయన ఈ విధంగా అన్నారు “నా జీవితంలో ఉన్న అతి పెద్ద సమస్య ఏంటంటే ఏదో జరుగుతుందని భయపడ్డాను. కానీ భయపడిన వాటిలో ఏ ఒక్కటీ ఎప్పుడూ జరగలేదు.” – విన్ స్టన్ చర్చిల్.

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...