24 September 2021

అయితే మీరు - మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగజేసెనని అనుకొందురేమో. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసికొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటివలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. ద్వితీ 8: 17,18.

నేటి దిన ధ్యానము:-
🙏ప్రభువు నామములో అందరికి శుభోదయం🙏
✝️*గర్వము*✝️

అయితే మీరు - మా సామర్థ్యము మా బాహుబలము   ఇంత భాగ్యము మాకు కలుగజేసెనని అనుకొందురేమో. 
కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసికొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటివలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. 
   ద్వితీ 8: 17,18.   

దేవుడు ఇశ్రాయేలీయులకు గర్వపడవద్దని చెప్తున్నారు. ఆయన “మా సామర్థ్యము, మా బాహు బలము ఇంత భాగ్యము మాకు కలుగజేసెనని మీరు అనుకొనవద్దు” అని వారిని హెచ్చరించుచున్నారు. ఇది ఎంత నిజము కదా! అవును మన దేవుడు మంచి ఆరోగ్యము ఇవ్వకపోతే, ఎంత అర్హత ఉన్నా, డిగ్రీలున్నా, తెలివి ఉన్నా, అందమున్నా, గొప్ప ప్రతిభలున్నా, అన్నీ వ్యర్థమే. కనుక మనము ఎల్లపుడూ దేవునిని జ్ఞాపకము చేసికొంటూ ఉండాలి. మనము ఐశ్వర్యము, ఆరోగ్యము పొందడానికి శక్తినిచ్చే వారు ఆయనే. కనుక ఆయన ముందర మనలను మనము తగ్గించుకొని, ఆయనను ఘనపర్చుదాము.

🛐ప్రార్థన:🛐

ప్రియమైన తండ్రీ, మీరనుగ్రహిస్తున్న ఐశ్వర్యాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి మీకే వందనాలు. మీకే కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాము. ప్రభువా, మీరు లేకుంటే మా జీవితాలు శూన్యమని మాకు తెలుసు. దయచేసి మాకు వినయ హృదయమనుగ్రహించి, మిమ్ములను ఘనపర్చడానికి మాకు సహాయము చేయమని యేసు నామములో ప్రార్ధన చేస్తున్నాము పరమ తండ్రి ఆమెన్!

👉గర్వపు మనిషి, ఎల్లపుడూ, ఇతరులను, ఇతర విషయాలను తన కంటే క్రిందగానే చూస్తాడు. అది నిజమే కదా! క్రిందగా చూసినంత కాలము తన కంటే పైనున్న వాటిని చూడటం అసాధ్యం. – సి. యస్. లూయిస్.

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...