నేటి దిన ధ్యానము:-
🙏ప్రభువు నామములో అందరకీ శుభోదయం🙏
✝️*విడిచి పెట్టకు*✝️
నిరీక్షణగలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి.
రోమీయులకు – 12 : 12
జీవితంలో కొన్నిసార్లు మనకు కలిగే శ్రమలు చూచినప్పుడు, ఇంక వాటికి అంతమే లేదు అని అనుకుంటాము. ఒక గొంతు క్యాన్సర్ ఉన్న స్త్రీ పాస్టర్ యాంగిచో సంఘమునకు వచ్చిందట. మాట్లాడడానికి కూడా కావడం లేదట. పాస్టర్ గారు “ఆయన పొందిన దెబ్బల చేత నేను స్వస్థపరచ బడ్దాను” అని ఒక వెయ్యి సార్లు వ్రాయమని చెప్పారంట. ఆమె వెళ్లి రాస్తునే రాస్తూనే ఉంది, ఆమె ఆ విధంగా ఆ వాక్యాన్ని రాస్తూ జీవితానికి అనువదించుకుంటూ ఉండగా, వెయ్యవ సారి వ్రాయకముందే ఆశ్చర్యంగా ఆమె స్వస్థపరచడింది.
ఈ విధంగా మనము ప్రార్థించేటప్పుడు ఏవో పొందాలని ఖచ్చితంగా అనుకుంటున్నప్పుడు మనము కొనసాగుతూనే ఉండాలి కానీ విడిచి పెట్టకూడదు. సిరియా సైన్యాధిపతియైన నయమాను యోర్దాను నదిలో ఆరు సార్లు మాత్రమే మునిగి ఉంటే, కుష్ఠురోగము నుండి స్వస్థత పొందే వాడు కాడు. నీవు విడిచిపెట్టుకొంటున్నావా? నీకు దేవుడు జవాబు ఇవ్వలేదు అని నిరుత్సాహపడి వున్నావా? పరిస్థితులను బట్టి విసిగి పోయావా? విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడును అయిన యేసయ్య వైపు చూడు. చాలా రోజులుగా నిలిచిపోయిన, నీ జవాబురాని ప్రార్ధనలన్నియూ ఏసయ్య విని ఉత్తరమిచ్చును గాక! సరి అయిన సమయంలో నిన్ను ఆదుకొనును గాక!
🛐ప్రార్థన:
యేసు ప్రభువా మా ప్రార్థనలకు జవాబు రానప్పుడు ఓపికతో కనిపెట్టే కృపను మాకు అనుగ్రహించండి. సరైన సమయంలో జవాబు దొరికేవరకు వేచి ఉండడానికి మాకు కృపనియ్యమని యేసు నామములో ప్రార్ధన చేస్తున్నాము పరమ తండ్రి ఆమెన్!
👉మనుష్యులు అలవాటుకు అభ్యాసమైన జీవులు, పరిస్థితి చాలా కఠినమైనప్పుడు నీవు విడిచిపెట్టితే, మరియొక సారి కఠిన పరిస్థితులు ఎదుర్కొనలేక సులభంగా విడిచి పెట్ట వచ్చు. అలా కాకుండా దాని గుండా వెళ్ళటానికి నిన్ను నీవు బలవంత పెడితే నీలో ధైర్యం అదే పెరుగుతుంది. – ట్రావిన్ బ్రాడ్ బెర్రీ.
No comments:
Post a Comment