నీకు శ్రేయస్సు కలిగించే ప్రణాళికలు నావద్ద ఉన్నాయి. అవి హాని చేసేవి కావు, నీకు నిరీక్షణను, మంచి భవిష్యత్తును ఇస్తాయి.” యిర్మీయా- 29:11

నేటి దిన ధ్యానము:-
🙏ప్రభువు నామములో అందరికి శుభోదయం🙏

 ✝️*మంచి భవిష్యత్తును*✝️

  “నీకు శ్రేయస్సు కలిగించే ప్రణాళికలు నావద్ద ఉన్నాయి.   
  అవి హాని చేసేవి కావు, నీకు నిరీక్షణను,   
  మంచి భవిష్యత్తును ఇస్తాయి.”.  
  యిర్మీ యా 29:11. 

యిర్మీయా 44 : దేవుని చిత్తాన్ని అంగీకరించి బబులోనుకు వెళ్ళిన యూదులు క్షేమంగా ఉన్నారు. ఆ అన్య దేశపు తప్పుడు పద్ధతులు అనుసరించకుండా, కృప పొందారు. 

అయితే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఈజిప్ట్ వెళ్ళిన యూదులు, కృపను పోగొట్టుకొని, ఆ దేశపు తప్పుడు పద్ధతులను పాటించి, దేవుని కోపాన్ని, ఉగ్రతను కొని తెచ్చుకున్నారు (7-14 వ).

తమ పాపపు ఆలోచనలు బయట పడినపుడు, దుర్మార్గులు వాటిని సరిచేసుకోవడం పోయి, ఆ పాపం లోనే రాటు తేలి, బాహాటంగా తిరుగుబాటు చేస్తారు (15-19).

దేవుని వాక్యాన్ని, ఆయన క్రమశిక్షణను తృణీకరిస్తూ పోతూవుంటే, మన హృదయం కఠినపడి, దేవుని ఉగ్రతను స్వయంగా మనమే ఆహ్వానించుకుంటాము.

మన హృదయాలను కఠిన పరచుకోకుందుము గాక (Psa 95:8; Heb 13:8)!

🛐ప్రార్ధన:-
ప్రియ ప్రభువా మాకు మంచి భవిష్యత్తును పొందునట్లుగా నీ క్రమశిక్షణలో వుండునట్లుగా ని కృప దయ చేయమని యేసు నామములో ప్రార్ధన చేస్తున్నాము పరమ తండ్రి.ఆమెన్!

No comments: