22 September 2021

ఆ మనుష్యులు అక్కడనుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్లిరి. అబ్రాహాము ఇంక యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పడు అబ్రాహాము సమీపించి యిట్లనెనుదుష్టులతోకూడ నీతి మంతులను నాశనము చేయుదువా? – ఆదికాండము 18:22,23.

నేటి దిన ధ్యానము:-
🙏ప్రభువు నామములో అందరికి శుభోదయం🙏
 ✝️*సంకోచించవద్దు*✝️

  ఆ మనుష్యులు అక్కడనుండి తిరిగి సొదొమ  
 వైపుగా వెళ్లిరి. అబ్రాహాము ఇంక యెహోవా సన్నిధిని   నిలుచుండెను. అప్పడు అబ్రాహాము సమీపించి   యిట్లనెనుదుష్టులతోకూడ నీతి మంతులను   నాశనము చేయుదువా? 
  – ఆదికాండము: 18:22,23.  

నా స్వభావము ఎలాంటిదంటే వేరే వాళ్ళ నుండి సహాయము తీసుకోవాలంటే చాలా సంకోచిస్తాను. చాలా అత్యవసర పరిస్థితులలో కూడా ఎవరిని సహాయం అడగను. కానీ నాది తప్పు. మనము క్రైస్తవులము, ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి ఉన్నాం. ఒక్కొక్కసారి నేను వేరే వాళ్లకు సహాయం చేయాలి, ఒక్కొక్కసారి ఇతరులు నాకు సహాయం చేయాలి. కానీ, ప్రతీ చిన్న విషయం నుండి పెద్ద విషయం వరకు దేవునిని అడగడానికి మాత్రం సంకోచించను . ఆయన సన్నిధిలో ప్రతీ విషయం కొరకు ప్రార్థిస్తాను. మనమందరము కలిసి దేవుడి సహాయం అడగడానికి సంకోచించకూడదు.

తండ్రియైన దేవుడు, సొదొమ, గొమొర్రాలను నాశనం చేయడానికి వచ్చినప్పుడు, ఆ సంగతి తన స్నేహితుడైన అబ్రాహాముతో చెప్పాలని అనుకున్నారు, చెప్పారు కూడా. అబ్రహాము తన సోదరుని కుమారుడైన లోతును అతని కుటుంబాన్ని రక్షించాలని ఆశించాడు. వెంటనే సంకోచించకుండా ప్రభువా “ఆ పట్టణములో 50 మంది నీతిమంతులు ఉంటే నాశనం చేస్తారా?” అని అడిగాడు. నిదానంగా అతడు 45, 40, 35, 20, 10 వరకు అడుగుతూ వచ్చాడు. సంకోచించకుండా దేవుని సన్నిధిలో వేడుకొని తన మనవిని వివరించాడు. చివరకు దేవుడు సోదోమ, గోమొర్రాలను నాశనము చేయకమునుపు లోతును అతని కుటుంబాన్ని రక్షించారు . ఇదంతా అబ్రహం సంకోచించకుండా దేవుని వేడుకోవడం వలన సాధ్యమైంది.

కనుక మనము సంకోచించకుండా దేవుని అడుగుదాము. ఒకవేళ మనం దేనివిషయమైనా దోషులుగా అనుకుంటున్నప్పటికీ, మొదట క్షమాపణ వేడుకొని, తర్వాత మన విన్నపములు సంకోచించకుండా అడుగుదాము. సర్వశక్తిమంతుడైన దేవుడు మీ హృదయ వాంచలన్నీ తీర్చును గాక !

🛐ప్రార్థన:
ప్రభువా, మాకు కావాల్సినవన్నీ మీ దగ్గర సంకోచించకుండా అడిగి, పొందుకోడానికి సహాయము చేయమని యేసు నామములో ప్రార్ధన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్!

ఉద్దేశించిన ప్రకారము ప్రయత్నించి, దాని నుండి వచ్చే ఫలితాలను పొందడానికి నీ మనస్సును తయారుగా ఉంచుకో. సంకోచించడం వలన ఈ ప్రపంచంలో ఏ మంచి జరగలేదు. – థామస్ హక్సెలే.

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...