29 September 2021

"మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే.”ఫిలిప్పీయులకు- 2:13


⛪ నేటి దిన ధ్యానము⛪
🙏ప్రభువు నామములో అందరికి శుభోదయం🙏

 ✝️*ఆ సత్యం మన యేసయ్య*✝️ 

“మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే.”
ఫిలిప్పీయులకు 2:13

మనం మన భయాలు, బంధకాలు నుండి విముక్తులమై దేవుడిచ్చిన నూతన జీవాన్ని, అధికారాన్ని సరిగ్గా ఉపయోగించుకొని నిలబడినట్లైతే, సత్యాన్ని తెలుసుకోనివ్వకుండా మనలని మభ్యపెట్టాలని ప్రయతిస్తున్న అపవాది యొక్క ఎన్నో శోధనలు మనము జయిచినవారమౌతాము.

సత్యమేమిటో మనం తెలుసుకొన్నప్పుడు అపవాది ఆటలు ఇంక సాగవు. గనుక సత్యమేమిటో తెలుసుకొనుటకు ప్రయత్నించుము. దేవునిపై ఆధారపడి ఆయననే అంటిపెట్టుకుని ఉన్నప్పుడు అపవాది మనలను ఏం చేయలేడు. ఆ సత్యం మన యేసయ్య!

🛐ప్రార్థన:🛐
ప్రియమైన తండ్రి, నన్ను సాతాను చెరనుంచి తప్పించినందుకు నీకు వందనములు. సాతాను శోధనలలో పడక అన్నివేళలా నిన్ను అంటిపెట్టుకుని యుండుటకు మరియు నీ యొక్క చిత్తానికి లోబడి జీవించుటకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్.

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...