Yesu naayakuda yella velanu | యేసు నాయకుఁడ యెల్ల వేళలను

3
యేసు సహాయమునకై ప్రార్థన
రా - మారువ, తా - ఆది
(ఛాయ: తనువు నాదిదిగో)

యేసు నాయకుఁడ - యెల్ల వేళలను నీ - దాసుల నేలుమయ్యా = మోసము లన్నిటి - మునగఁద్రోతునని- బాసలు జేసిన - ప్రభుఁడవు నీవెగా llయేసు||

1.ేయింబవలు మా - న్యాయము చెరిపెడి - మాయ పిశాచిని = త్రోయుమి దూరము - బాయక భక్తుల - చేయి విడువని బహుశ్రేష్టుఁడ నీవెగా llయేసుll

2.హృదయము లోకము - మది పాపము మమ్ము - సతతము శ్రమ పెట్టును = సదయుఁడ మమ్మును - వదలక నిత్యము - మది తలపులలో - మహిమగ నేలుమీ llయేసుll

3.కాపాడుమి మమ్ము - మాపు  రేపు నీ - శ్రీ  పాదము లొద్దను = ఏ పాపములును ఏలకుండగ నీ - ప్రాపునఁబెంచుము - మాపాలకుఁడవో llయేసుll

4.మా కొరకై నీ - మేనును మ్రానున - మేకులతోఁ గొట్టగ - మానము మహి ములు - మనుజుల  కియ్యను - భానుఁడ రాజుగ - బ్రతికిలేచితివి llయేసుll

5.చెఱను చెఱనుగా - మరి  పట్టుక నీవు - పరమున కరిగితివే -వరముల నిడితివి - ధరలో నరులకు - పరముఁడ నీ దయ మరువశక్యమా llయేసుll 
                        - గొల్లపల్లి నతానియేలు

No comments: