2
దేవుడు సర్వస్తోత్ర పాత్రుడు
రా – ఆనందభైరవి, తా - త్రిపుట
(ఛాయ: యెహోవ భజన)
గానముఁ జేయుఁడు సుకీర్తనను = యెహో - వాను గూరిచి క్రొత్తం - గాను రక్తిగను ||గానము||
1.తన్నామము నుతించి యతని - రక్షఁ - జెన్నుఁగ సారెఁ బ్ర - సిద్ధముఁ జేసి = పన్నుగ నన్యులలో దన్మహిమ యం - దున్నత చిత్రము - లను జాటండి ||గానము||
2.ఘనతయు మహత్మ్యమును - ద - ద్ఘనని యెదుటనుండు - ఘనబలమును = వినతమౌ సౌందర్యమును - న - తనివి నిర్మల స్థల -మున విలసిల్లు ||గానము||
3.పరిశుద్ధాలంకారముతో - నా - పరమాత్మారాధన - పరులై యుండండి = ధరణి సకల జనులారా - లోక - గురుని యెదుట భీతిఁ - గొనుచు నుండండి ||గానము||
4.పరిపాలించుచున్నాఁ డనుచు తోడి - నరులతోఁ జెప్పుండి - ద్ధరఁ గదకుండ = స్థిరముగఁ జేయు సత్యముగా - జనుల - కరిమురిగాను న్యా - యము విమర్శించు ||గానము||
5.ఏమనిన నా మహాత్ముండు - వచ్చు - నీ మహికి న్యాయము - నేర్పరచు టకు = భూమి జనులకు నీతి సత్య - ముల - తో మించు న్యాయ మెం - తో విమర్శించు ||గానము||
6.జనులారా యా యెహోవాకు మహి - మను - బలమును సమర్పణము జేయండి వినయముతోఁ గానుకలను - తీసి - కొని తత్ప్రాకారమందున వసియింపండి ||గానము||
- విలియం డాసన్
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment