Mahimagala Thandri Manchi | మహిమగల తండ్రి మంచి

మహిమగల తండ్రి - మంచి వ్యవసాయకుడు      మహితోటలో - నర మొక్కలు నాటించాడు
తన పుత్రుని రక్తనీరు - తడి కట్టి పెంచాడు
తన పరిశుద్ధాత్మను - కాపుగావుంచాడు (2)
కాయవే తోట - కమ్మని కాయలు
పండవే చెట్టా - తియ్యని ఫలములు ||కాయవే||

1. నీతి పూత జాతికాపు - ఆత్మశుద్ధి ఫలములు
నీ తండ్రి నిల్వచేయు - నిత్య జీవ నదులు
అనంతమైన ఆత్మ బందు - అమరసుఖ శాంతులు
అనుకూల సమయమిదే - పూయు పరమపూతలు (2)||కాయవే||

2. అపవాది కంటబడి - కుంటుబడిపోకు
కాపు పట్టి చేదు పండ్లు - గంపలుగా కాయకు
వెర్రిగా చుక్కలంటి - ఎదిగి విర్రవీగకు
అదిగో గొడ్డలి వేరున - పదును పెట్టియున్నది (2)||కాయవే||

3. ముద్దుగా పెంచాడు – మొద్దుగా నుండకు
ముదముతో పెంచాడు - మోడుబారిపోకు
ముండ్ల పొదలలో కృంగి - మెత్తబడిపోకు
పండ్లుకోయువాడు వచ్చి - అగ్నివేసి పోతాడు (2)||కాయవే||

DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: