వధువు సంఘమారావమ్మా
శృంగార ప్రభువు యేసమ్మ
వరుడు క్రీస్తు గొరియ పిల్లమ్మ
1. పశ్చాత్తాపమే పెండ్లి చూపులమ్మా-
పాప క్షమాపనే నిశ్చితార్దమమ్మా
విరిగిన మనసే వరుని కట్నమమ్మా-
నలిగిన హృదయమే పెళ్లి పత్రికమ్మా
గొరియ పిల్ల రక్తములొ తడిచిన -
పవిత్ర కన్యవై నిలచేవమ్మా(2) ||బంగారు||
2. కొరడా దెబ్బలే పెండ్లి నలుగమ్మా-
అసూయ ద్వేషాలే సుగంధ ద్రవ్యమమ్మా
నెత్తుటి ధారలే పెళ్లి చీరమ్మా -
ముళ్ళ కిరీటమే పెండ్లి ముసుగమ్మా
ప్రకాశమయమై నిర్మలమైన
పరిశుద్ధల క్రియలై నడిచేవమ్మా(2) ||బంగారు||
3. కల్వరి కొండే పెళ్లి పీటమ్మా -
దేవుని దూతలే పెండ్లి సాక్షులమ్మా
సిలువ దండమే పెండ్లి సూత్రమమ్మా -
దూషణ హేళనే పెండ్లి అక్షింతలమ్మా
సువర్ణమయమై స్వచ్చమైన
స్పటికమువలే మెరిసేవమ్మా(2) ||బంగారు||
No comments:
Post a Comment