583
కోఁత పండుగ
రా - శంకరాభరణము, తా - ఆది
యెహోవ సన్నిధిని - నీ స్తోత్ర గానముతో = మహోపకారునకు - మానుగనర్పణ సమర్పించుడి ||యెహోవ||
1.ప్రభు వడుగు నర్పణలు - ప్రేమ కృతజ్ఞతలు = అభయ ప్రధానములు - విభునకు నియ్యుడు విరివిగను ||యెహోవ||
2.రిక్త హస్తములతో - రావలదు సన్నిధికి = భక్త వత్సలునకు - శక్తికొలది మీ రర్పించుడి ||యెహోవ||
3.శృంగారాలయమిలలో - పొంగార గట్టుటకు = బంగారు వెండి యును బాగుగ నియ్యుండి ప్రభుపేర ||యెహోవ||
4.వరుమానములచేత - వాంఛింప వలదండి = గురునాజ్ఞ చొప్పునను - విరివిగ హృదయము లర్పించుడి ||యెహోవ||
5.యెహోవ జనులారా - యియ్యుండి మనసార = యెహోవ యిచ్చినది - యేసున కర్పణ చెల్లింతము ||యెహోవ||
- గుంజా వెంకటరత్నము
DOWNLOAD MP3 SONG HERE 👇
1 comment:
Praise the lord loVe you Jesus for ever nd never till my last breathe u gave my 2 families to me u gave me what I was asked u Amen hallelujah ✝💘✝✝✝💟✝💘
Post a Comment