Aacharyamaina Prema | ఆశ్చర్యమైన ప్రేమ

ఆశ్చర్యమైన ప్రేమ - కల్వరిలోని ప్రేమ
మరణము కంటే - బలమైన ప్రేమది 
నన్ను జయించే నీ ప్రేమ ||ఆశ్చర్య||

1.పరమును వీడిన ప్రేమ ధరలో - పాపిని వెదకిన ప్రేమ 
నన్నుకరుణించి ఆదరించి - సేదదీర్చి నిత్యజీవమిచ్చె ||ఆశ్చర్య||

2.పావన యేసునిప్రేమ - సిలువలో పాపిని మోసిన ప్రేమ
నాకై మరణించి జీవమిచ్చి - జయమిచ్చి తన మహిమ నిచ్చె ||ఆశ్చర్య||

3.శ్రమలు సహించిన ప్రేమ - నాకై శాపము నోర్చిన ప్రేమ 
విడనాడని ప్రేమది - ఎన్నడూ ఎడబాయదు ||ఆశ్చర్య||

3.నా స్థితి జూచిన ప్రేమ - నాపై జాలిని చూపిన ప్రేమ 
నాకై పరుగెత్తి కౌగలించి - ముద్దాడి కన్నీటిని తుడిచే ||ఆశ్చర్య||
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: