ఆలయంలో ప్రవేశించండి అందరూ
స్వాగతం సుస్వాగతం - యేసు నామంలో
నీ బ్రతుకులో పాపమా - కలతలా
నీ హృదయంలో బాధలా - కన్నీరా
నీ కన్నీరంతా తుడిచి వేయు రాజు యేసు కోసం
||ఆలయ||
1. దీక్ష స్వభావంతో - జ్ఞాన స్వభావమై వెదికే వారికంతా కనబడు దీపమై
యేసురాజు మాటలే వినుట ధన్యము
వినుట వలన విశ్వాసం అధిక మధికమై
ఆత్మలో దాహము - తీరునూ రారండి
ఆనందం.. ఆనందం...హల్లెలూయా ||ఆలయ||
2. ప్రభు యేసు మాటలే- పెదవిలో మాటలై
జీవ వృక్షంబుగా ఫలియించాలని
పెదవితో పలికెదం - మంచి మాటలే
హృదయమంత యేసు ప్రభుని ప్రేమ మాటలే
నింపెదం - నిండెదం - కోరెదం -పొందెదం
ఆనందం...ఆనందం...హల్లెలూయా ||ఆలయ||
No comments:
Post a Comment