ప్రభు మార్గము తెలుసుకో


🙏ప్రభువు నామములో శుభోదయం🙏

⛪నేడు దిన ధ్యానము⛪

 *✝️ప్రభు మార్గము తెలుసుకో✝️

మేలు కలుగు మార్గమేది అని యడిగి 
 అందులో నడుచుకొనుడి, 
అప్పుడు మీకు నెమ్మది కలుగును.
యిర్మియా: 6:16

నీవు తెలియని ఊరికి వెళ్తే ఆ ఊరికి ఏ మార్గంలో వెళ్ళాలి, ఏది మంచి మార్గం అని ఒకటికి పదిసార్లు తెలిసిన అందర్నీ కనుక్కొని ఏ మార్గము నీ మనస్సుకి మంచిదిగా అనిపిస్తే ఆ మార్గం గుండా వెళ్తావు. అలాగే మేలు కలుగు మార్గమేది, మంచి మార్గమమేది అని దేవునిని అడిగి, అందులో నడుచుకోవాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ జీవిత ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటావు. అటువంటిది జీవ మార్గము, పవిత్ర మార్గము, విశ్వాసమార్గమును తెలుసుకోవాలంటే ఎంత సిద్ధపాటు ఎంత పవిత్రతో నీవు ఉండాలి! ఆలోచించు.

🛐 *ప్రార్థన* 🛐
ప్రభువా! నేను అనేకమార్లు మార్గము తప్పి నడిచిననూ, తిరిగి నీ మార్గములోనికి నడిపించి దీవించుచున్నoదుకు వందనములు. నీ మార్గములో స్థిరముగా నడచుటకే నన్ను సిద్ధపరచి మని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్!

No comments: