అవనిలో ఉద్భవించే ఆది సంభూతిని చూడరే
పుడమియే పరవసించే పసిబాలుని చూడగనే పసిబాలుని చూడగనే
ఆకాశమే పట్టనోడు - ధరణిలో పుట్టినాడు
దావీదు పురమునందు దీనుడై - వెలసినాడు రక్షకుడు
ఆనందమే మహా ఆనందమే - అందరికి ఇలలో సంతోషమే
ఆశ్చర్యమే ఇది అద్భుతమే - యేసు జననం అద్భుతమే (2) ||ఆకాశమే||
1. అదృశ్య దేవుని మహిమ స్వరూపుడు - ఆది అంతమైన పరలోక నాధుడు (2)
ఆదియందు వాక్యంబుగా - సృష్టి కార్యము జరిగించినాడు -
ఆనాది నుండి జ్ఞానంబుగా - సృష్టి క్రమము నడిపించినాడు (2)
అన్నిటిని కలిగించిన మహరాజు - కన్నీటిని తుడచుటకు దిగివచ్చినాడు (2) ||ఆనందమే||
ప్రేమను పంచే ప్రేమామయుడు - రక్షణ ఇచ్చే రక్షించే దేవుడు (2)
2. పాపమే లేని సుగుణాల సుందరుడు - శాపము బాపము జన్మించెను చూడు (2)
నిత్యముండు నీతిసూర్యుడు - సత్యసాక్షిగా ఇలకొచ్చినాడు - ప్రేమను పంచే పావనాత్ముడు - పశుల పాకలో పవళించినాడు (2)
సర్వాధికారి ఐన మహరాజు - దీనులకు దీవెనగా దిగివచ్చినాడు (2) ||ఆనందమే||
No comments:
Post a Comment