01 November 2021

త్రోవలు సరాళము చేసే దేవుడు


🙏ప్రభువు నామములో శుభోదయం🙏
⛪నేడు దిన ధ్యానము:-⛪

✝️ *త్రోవలు సరాళము చేసే దేవుడు*✝️

ఆయన నీ త్రోవలను సరాళము చేయును.
 - సామె. 3:6

దేవుని వాక్యములు నమ్మదగినవి. అనేకులు వలే వాటిని పరిశీలనగా దేవుని దేవుని వాక్యము అపార్థం చేసుకుంటే నీ జీవితం కాదని గ్రహించాలి తెలియజేస్తున్నాడు మానవుని జీవితంలో ఆశీర్వాదకరంగా కొనసాగాలంటే మొదటిగా తన ప్రవర్తన అంతటియందు దేవుని అధికారమునకు ఒప్పుకోవాలని దైవ హెచ్చరిక చేస్తున్నాడు సొలొమోను వ్యక్తిగత సాక్ష్యం గమనించదగినది ఎందుచేతనంటే తన తండ్రియైన దేవుని దృష్టికి ఆమోదయోగ్యంగా ఎంచి బడటం గొప్ప ఆత్మీయ ఆదరణ కలిగించున్నది. నీ త్రోవలను సరాళము అంటే ఇకనైనా నీ జీవితమును ప్రవర్తనను దేవునికి ఆమోదయోగ్యముగా ఉండేటట్లు మార్చుకో వలసిన యున్నది. ఈనాటికీ నీకు అనుకూల సమయమును తరుణమును దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడని మరువవద్దు. ఆయన క్షమించుటకు సిద్ధమనసు గలవాడు. నీవు దేవుని సహాయం లేకుండా నీ సొంత ప్రయత్నాలపై ప్రణాళికలపై ఎంత ఆధారపడిన నిష్ప్రయోజనమే.నీ ప్రయత్నానికి, ప్రణాళికలకు దేవుని సహాయం తోడైతేనే నీ మార్గములు సరాళము అవుతాయని జ్ఞాని తెలియజేస్తున్నాడు. పరిశుద్ధ దేవుని వాక్యపు వెలుగులో నీ జీవిత అనుభవమును ప్రవర్తన సరిచేసుకుంటూ ఉండటానికి దయా కనికరము గల దేవుని సన్నిధి, దేవుని కృప తోడైయుండును గాక!
 
🛐*ప్రార్ధన*🛐
ప్రభువా నా ప్రవర్తన అంతటి మీద మీ అధికారమును నేను ఒప్పుకుంటున్నాను. నన్ను మీ ఆధీనంలో ఉంచుకుని దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్..

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...