31 October 2021

Yesu Mammu Nadipinchu | యేసు మమ్ము నడిపించు


432
    
Saviour, like a Shepherd lead us

1. యేసు, మమ్ము నడిపించు 
నీదు కాపు కావలెన్ 
నీవు మమ్మును బోషించు 
మమ్ముఁ జేర్చు మందలోన్ 
యేసునాధా, ప్రియనాధా! 
మమ్ము విమోచించుమా.

2. మమ్ము నాదరించు యేసూ 
మాకు పాలకుండవు 
పాప మార్గమందు నుండి 
ప్రేమతో! దప్పించుమీ 
యేసునాధా, ప్రియనాధా! 
మొఱ్ఱ నాలకించుమా.

3. బీద పాపు లైన మమ్ము - 
నీ వంగీకరింతువు 
మమ్మును బవిత్రపర్చి 
మమ్ము విడిపించుమీ 
యేసునాధా, ప్రియనాధా! 
నిన్ను నాశ్రయింతుము 

4. బాల్యమందు నిన్ను ఁ జేరి 
నిన్ను హత్తుకొందుము 
ప్రియ రక్షకుండ, యేసూ 
నీ ప్రేమఁ జూపుమా 
యేసునాధా, ప్రియనాధా! 
మమ్మింకఁ బ్రేమించుమా. 
                                  అను : జేకబ్ చేంబర్లేన్

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...