అవసరములు తీర్చు దేవుడు


🙏ప్రభువు నామమున శుభోదయం🙏
⛪నేడు దిన ధ్యానము:-⛪

✝️ *అవసరములు తీర్చు దేవుడు*✝️
   
దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును 
ఫిలిప్పీ. 4:19


ఈ లోకములో మనుగడ లేక జీవితం కొనసాగించటానికి సమయమును బట్టి అవసరములు తీర్చుకోవటానికి ధనము కావలసియున్నది కదా! గమనించదగిన విషయం ఏమిటంటే మీ జీవితంలో అవసరములు తీర్చుకోవటానికి దేవుడే ఐశ్వర్యం చొప్పున ప్రతి ఈవిని అనుగ్రహించునని అపోస్తుల పౌలు అనుభవపూర్వకముగా వెల్లడి చేస్తున్నాడు. అతని సేవా పరిచర్య జీవితములో అనేక ఇబ్బందులు, లేమి, అవసరములు కలిగిన వాటనన్నింటినీ కేవలం తనను పిలుచుకున్న, ఏర్పరచుకొన్న దేవుని పై ఆధారపడటం ప్రతి ఒక్కరికీ ఎంతో ప్రేరణ కలిగిస్తుంది. సాధారణముగా పెద్దవారు అనుభవపూర్వకముగా అనుభవించి సామెతలు చెప్పే వారిని చూస్తూ ఉంటాము. నీ జీవిత అనుభవములలో కూడా నిన్న, నేడు, రేపు ఒకటే రీతిగా ఉన్న దేవుడు తన ఐశ్వర్యము చొప్పున నీ ప్రతి అవసరమును తీర్చునని ఎన్నడు మారువవద్దు.ఆయన ధనవంతుడు సమస్త మానవాళి అవసరత కొరకు ముఖ్యముగా నీ అవసరత తీర్చుటకు ఆయన సిద్ధంగా ఉన్నారు. కనుక ఏ సమయానికి ఏది అవసరమో దేవునికి తెలుసు ఆయనకు రహస్యమైనది ఏదీ లేదు ప్రతి మనిషి కోరికలను అవసరములను ఆయనే తీర్చునని వాగ్దానం ఇస్తున్నాడు. కనుక ఎలాంటి పరిస్థితుల్లోనూ కలవరపడకుండా, కేవలం యేసు వైపు చూస్తూ విశ్వాసంలో దేవునికి ఇష్టమైన రీతిలో నీ జీవితం కొనసాగించు. నీ ప్రతి అవసరతను పొందు కొనటానికి దేవుని కృప సహాయములు నీకు అనుగ్రహించును గాక!

🛐 *ప్రార్ధన:-*🛐
నా ప్రియ యేసు ఇప్పటివరకు నా జీవితంలోని అవసరతలు తీర్చి నన్ను నడిపించినందుకు వందనములు ఇకముందు కూడా నా అవసరతలు తీర్చి నన్ను దీవించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్!

No comments: