Yevaru Lerayya Ne Ontari | ఎవరూ లేరయ్య నే ఒంటరి


ఎవరూ లేరయ్య - నే ఒంటరి దాననయ్య - 
అందరూ నాకున్నా - నే నేవరికి చెందనయ్య (2)
ఈ పోరాటం సమసిపోయేది ఎన్నడయ్య - 
నీ సన్నిధిని నేను చేరేది ఎప్పుడయ్య (2)

అమృతమంటి అమ్మ ప్రేమను నేను పొందలేదు -
భర్త యొక్క అనురాగానికైన నోచుకోలేదు (2)
కన్న బిడ్డలే శత్రువులై నను బాదిస్తున్నారు 
నా బంధువులే విరోధులై నను వేదిస్తున్నారు 
దిక్కు లేని నాపైన దయచూపుము యేసయ్య ll ఎవరూll

నిందలనింక సహియించి ఓపిక ఇక లేదు -
అవమానాలను భరియించే ధైర్యము కనరాదు (2)
నా ఉనికే అందరికి ఇలలో భారముగా ఉంది
దుఃఖముతో కంటికి కునుకె కరువైపోయింది
కనికరించి ఇకనైన నా కరమందుకోవయ్య  ll ఎవరూll

No comments: