ఫలించుటకు నిలిచియుండుడి

🙏ప్రభువు నామములో  శుభోదయం.🙏..
⛪నేడు దిన ధ్యానము⛪
 
 ✝️*ఫలించుటకు నిలిచియుండుడి*✝️

నేను ఎవనియందు నిలిచియుందునో 
వాడు బహుగా ఫలించును.
యోహాను 15:5

విశ్వాసులు క్రీస్తు యందు నిలిచి ఉన్నారు. వారు అనుసరించేందుకు నిర్ణయించుకోవాలి. నీవు స్వేచ్ఛగా క్రీస్తును విడిచిపెట్టిపోయేలా ఉండకూడదు. నీవు క్రీస్తును అంటిపెట్టుకుని ఉంటే, దేవుడు నిన్ను విడువక విడిచిపెట్టక నడిపిస్తాడు. నీవు క్రీస్తు లో తప్పక నిలిచి ఉండాలి. ఆయన సత్యాన్ని నీలో ఉండనివ్వాలి. ఆయన వెల్లడించిన సత్యాలను నమ్మడంలో కొనసాగాలి. అప్పుడు సమృద్ధిగా ఫలిస్తావు. క్రీస్తు జీవం, ప్రభావం నీలో ప్రవహిస్తాయి. కాబట్టి ఎల్లప్పుడు నీవు దేవునిలో నిలిచి ఉంటావు. నిజంగా ఆయనలో నిలిచి ఉండకుండా, ఆయనను సేవించాలన్న ఏ ప్రయత్నమైనా, మతసంబంధమైన ఎన్ని కార్యకలాపాలైనా, విజయవంతంగా కనిపించేవి ఎన్ని అయినా నిష్ఫలమైపోతాయి. ఆధ్యాత్మికమైనది నిజంగా దేవుడు కోరుకునేది ఆయనలో నిలిచి ఉండాలని. అలా ఆయన యందు నిలిచి ఉంటే నిత్య రాజ్యం మరియు జీవం నీ కిచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే నీలో ఆయన మాటలు,ఆయన ధ్యానము, నీ హృదయంలో ఉంటేనే ఆయన నీలో నిలిచి ఉండి, నీ జీవితాన్ని ఫలించే జీవితంగా ఫలించే జీవితంగా ఫలించు ద్రాక్షావల్లి వలె నిన్ను దీవిస్తాడు. అటువంటి దీవెనలు పొందుకోవటానికి దేవుని యొక్క నీడ నీకు తోడైయుండును గాక!

 🛐*ప్రార్ధన*🛐
నా దేవా నీలో నిలిచి ఫలించినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్!

No comments: