Aa Bhojana Pankthilo Simonu | ఆ భోజన పంక్తిలో సీమోను


ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో - అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను (2)
కన్నీళ్లతో పాదాలు కడిగింది - తన కురులతో పాదాలు తుడిచింది (2) 
సువాసన సువాసన ఇల్లంత సువాసనా - ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన (2)   

1. జుంటి తేనె ధారల కన్నా మధురమైనది వాక్యం - ఆ వాక్యమే నన్ను బ్రతికించెను (2) 
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆరాధన - ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన (2)  || ఆ భోజన ||  

2. సింహాల నోళ్లను మూసినది ఈ వాక్యం - దానియేలుకు ఆపై విడుదలిచ్చే ఈ వాక్యం (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆరాధన - ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన (2)  || ఆ భోజన ||

No comments: