మీలోని జీవాత్మ

🙏ప్రభువు నామములో శుభోదయం🙏

నేటి దిన వాక్య ధ్యానము

(మీలోని జీవాత్మ)

“మీరు బ్రదుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను”.
యెహెజ్కేలు 37:5

మన యొక్క జీవం శ్వాసపైనే ఆధారపడియుంది. అది మనము నిరంతరం చేసే పని. అలాగే దేవుడు అనుగ్రహించిన జీవాత్మ మనకు చాలా అవసరము.

మన జీవం ఆయన మనకు అనుగ్రహించిన జీవాత్మతో మొదలైంది. అదే మనలను నిత్యము బ్రదికిస్తున్నది. ఆయన మనకు ఇచ్చిన ఆ జీవాత్మ వలనే మనము అందమైన జీవితాన్ని అనుభవించుచూ మన ప్రతీ ఒక కలను నిజము చేసుకోగలుగుతున్నాము. ఇతరులకు ఒక గొప్ప సాక్ష్యముగా, దీవెనగా అగపడుచున్నాము.
ఆ జీవాత్మ లేకుండా మనము శ్వాసించలేము, మాట్లాడలేము, కదలలేము అసలేమీ చేయలేము. మనం జీవాత్మతో మరియు మనకున్న స్వచిత్తముతో దేవుడికి ఇష్టమైన పనులను చేద్దాం.

🛐ప్రార్థనా🛐
ప్రియమైన తండ్రి! నీవు నాకు అనుగ్రహించిన జీవాత్మను బట్టి నీకు వందనములు. నీయందు నూతనముగా జన్మించిన మాకు మీలాగా ఉండడానికి సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్.

👉 మనం సంపాదించిన దాని ద్వారా మనం జీవనం సాగిస్తాం, కానీ మనం ఇచ్చే దాని ద్వారా మనం జీవితాన్ని సాధిస్తాము.
- విన్స్టన్ చర్చిల్

No comments: