మనము ఆయన వారము

నేటి దిన ధ్యానము:-
🙏ప్రభువు నామములో అందరికి శుభోదయం🙏

 ✝️*మనము ఆయన వారము*✝️ 

“యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము”. 
      కీర్తనలు– 100:3.   

దేవుడు మన మీద తాను కలిగిన ఉద్దేశములలో చిన్నవి ఏవియూ లేవు. దేవుడు పిచ్చుకలు గురించి కూడా లక్ష్యపెట్టువాడు మనయెడల నిర్లక్ష్యంగా ఉండడు. మన ఇష్టాయిష్టాలను ఎఱిగినవాడు. ఎందుకంటే ఆయన మనలను ప్రేమించు దేవుడు.

కానీ ఐహికమైన మన కోరికలు మన యిష్టాలు దేవుని నుండి మన దారిని మళ్ళిస్తాయి. ఆయన కోసం పని చేయుటయందు ఆయన రాజ్యానికి సిద్ధపడుటయందు ఆటంకపరుస్తాయి. ఆయనే మనలను సృష్టించి అన్నియూ మనకు సమకూర్చినవాడు. మన ప్రతీ అవసరాలను తీర్చి మనలను నడిపించువాడు. మన కుటుంబములు, స్నేహితులు, ఉద్యోగము విషయంలో ప్రతీ విషయములో తోడై యున్నాడు. ఆయన మన దేవుడు మనము ఆయన వారము. ఈ సత్యాన్ని తెలుసుకొని ఆయనను విడువకయుందము.

🛐ప్రార్థనా:
ప్రియమైన తండ్రి, నా ప్రతీ అవసరతను తీర్చి నా ప్రతీ శ్రమలో నాకు తోడైయున్నందుకు నీకు వందనములు. నీ చిత్తమును నెరవేర్చుటకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్.
Credits goes to:
Rev. Mohan garu,
St. Paul's Lutheran Church,
Korukonda.

No comments: